Telangana Congress Declaration: టీకాంగ్రెస్ విడుదల చేసిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ( SC, ST Declaration)పై తెలంగాణలో రచ్చ నడుస్తోంది. అధికార పార్టీ నాయకులు వరస పెట్టి మరి స్పందిస్తూ కౌంటర్స్ ఇస్తున్నారు.ఈ డిక్లరేషన్‌పై ముందుగా మంత్రి కేటీఆర్ (KTR)స్పందిస్తూ..అది డిక్లరేషన్ సభ కాదు.. అధికారం రానే రాదనే ఫ్రస్ట్రేషన్ సభ అని ఐటీ శాఖ మంత్రి విమర్శించారు. స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తరువాత కూడా..ఎస్సీ, ఎస్టీ వెనకబడి ఉన్నారంటే..దానికి కారణం…ప్రధాన దోషే..కాంగ్రెస్ పార్టీ.. దళిత, గిరిజన బిడ్డలకు.. కాంగ్రెస్ చేసిన దశాబ్దాల పాపమే..ఆ పార్టీని మరో వందేళ్లయినా శాపంలా.. వెంటాడుతూనే ఉంటుందని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. మంత్రి హరీష్‌రావు (Harish rao) స్పందిస్తూ ఖర్గే సొంత రాష్ట్ర కర్ణాటకలో మొదట డిక్లరేషన్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రారని హరీష్‌రావు అన్నారు. బీఆర్ఎస్ నాయకుల స్పందనపై రేవంత్‌రెడ్డి రీ ట్వీట్ ( Revanth Reddy Retweet) చేశారు.
పూర్తిగా చదవండి..Congress Declaration: యావత్ తెలంగాణ గుండె చప్పుడు ఒక్కటే: రేవంత్‌రెడ్డి రీట్వీట్
కేటీఆర్- రేవంత్‌రెడ్డి మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు ఒక్కటే నని. త్వరలో సీఎం కేసీఆర్ ఖేల్ ఖతం..బీఆర్ఎస్ దుఖాన్ బంద్ అని రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Translate this News:











