Kishan Reddy Fired On KCR: గత 9 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. “డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై బీజేపీ పోరుబాట” కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యాలు నెరవేరలేదన్నారు. కేసీఆర్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. ఎన్నో ఆకాంక్షలతో ఏర్పడ్డ తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం చేతిలో దోపిడీకి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇరిగేషన్ నుంచి దళితబంధు(Dalit Bandhu) వరకు అంతా అవినీతి మయంగా మారిందన్నారు. తెలంగాణలో అహంకారపూరిత పాలన కొనసాగుతోందని ఎంపీ మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..Kishan Reddy: కేసీఆర్కు ఓట్లు అడిగే హక్కులేదు.. కిషన్ రెడ్డి ఫైర్
గత 9 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. "డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై బీజేపీ పోరుబాట" కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహించింది.

Translate this News:











