ఎన్నికల ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. ఆదివారం బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించిన అనంతరం హుస్నాబాద్ వేదికగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన గులాబీ బాస్.. సోమవారం జనగామ, భువనగిరి సభలతో హోరెత్తించారు. రెండు సభల్లోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరిస్తూనే.. ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎన్నికలప్పుడు వచ్చి ఆగమాగం చేసేవారిని, ఆపద మొక్కులు మొక్కే వారిని నమ్మొద్దన్న కేసీఆర్.. రానున్న ఐదేళ్లలో మన కర్మను నిర్ణయించేది మన ఓటేనని, మంచి చెడులను గుర్తెరిగి ఓటెయ్యాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
పూర్తిగా చదవండి..కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలపండి.. ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటేయ్యండి- కేసీఆర్
కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలపండంటూ ఫైర్ అయ్యారు కేసీఆర్. ఎన్నికలప్పుడు వచ్చి ఆపద మొక్కులు మొక్కేవారిని నమ్మొద్దన్నారు. మన కర్మ డిసైడ్ అయ్యేది మనం వేసే ఓటుతోనేనని చెప్పారు. భువనగిరి, జనగామ ప్రజా ఆశీర్వాద సభల్లో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.

Translate this News:











