తెలంగాణలోని కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో సరికొత్త రాజకీయం నడుస్తోంది. ఎన్నికల వేళ సరిహద్దులు దాటి తెలంగాణలోకి వస్తున్న కర్ణాటక రైతులు కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తున్నారు. మొన్న గద్వాల్ జిల్లాలో, తాజాగా రేవంత్ రెడ్డి పోటీ చేయనున్న కొడంగల్‌లో కర్ణాటక రైతులు ఆందోళనలు, ర్యాలీలు చేపట్టారు. అయితే వారిని కాంగ్రెస్ శ్రేణులు అడ్డగించడంతో పాటూ రేవంత్ రెడ్డి నినాదాలతో హోరెత్తించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పూర్తిగా చదవండి..Telangana: సరిహద్దు జిల్లాల్లో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దంటున్న కర్ణాటక రైతులు..
తెలంగాణలో కర్ణాటక రైతల కాంగ్రెస్ వ్యతిరేక నిరసనలు సంచలనం రేపుతున్నాయి.మొన్న గద్వాల్ జిల్లాలో నిరసన చేసిన రైతులు.. తాజాగా రేవంత్ రెడ్డి పోటీ చేయనున్న కొడంగల్‌లో ఆందోళనలు చేపట్టారు. కర్నాటకలో ఐదు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు వాటిని అమలు చేయలేక పోతోందని కళ్యాణ్ కర్ణాటక రైతు సంఘం నేతలు ఆరోపించారు.మరోవైపు తెలంగాణలో రైతులను అబద్దాలతో నమ్మించలేక డబ్బులిచ్చి కర్ణాటక నుంచి రైతుల పేరుతో పెయిడ్ బ్యాచ్‌ను దింపి బీఆర్ఎస్ ప్రచారాలు చేయుస్తోందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.

Translate this News:











