Telangana BJP: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి.. వరుస షాక్‌లు ఎదురవుతున్నాయి. తాజాగా సీనియర్ నేత మృత్యుంజయం బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డికి పంపించారు. ఇక లేఖలో తన రాజీనామాకు కారణంగా సంచలన ఆరోపణలు చేశారు మృత్యుంజయం. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య సంబంధాలు చూశాక ఇకపై పార్టీలో కొనసాగలేకపోతున్నానని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Telangana: బీజేపీకి షాక్.. ఆ బంధం చూసి ఉండలేనంటూ పార్టీకి రాజీనామా చేసిన కీలక నేత..
Telangana BJP: మృత్యుంజయం కరీంనగర్ జిల్లాలో సీనియర్ పొలిటికల్ లీడర్. ఆయన గతంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా కూడా చేశారు. కరీంనగర్ మాజీ శాసనసభ్యులు కూడా. నాటి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రోద్బలంతో 2019లో మృత్యుంజయం కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో చేరారు.

Translate this News:











