ప్రతీ పథకంలో కేంద్ర నిధులే ఉన్నాయని కరీంనగర్ ప్రెస్ మీట్ బండి సంజయ్ తెలిపారు. నిధులు కేంద్రానివి.. సోకులు రాష్ట్రానివి.. అని ఎద్దేవా చేశారు. ధాన్యం కొనేది కేంద్రం. ప్రతి గింజా మేము కొంటున్నామని రాష్ట్రం అబద్దాలు చెబుతున్నదని రైతులు ఈ విషయం గుర్తించారని బండి పేర్కొన్నారు. ఉపాధి హామీ డబ్బులు కూడా మావేనని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకున్నారని ఫైర్ అయ్యారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు పేరుతో గొప్పలు చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. పంటలు నష్టపోతే పరిహారం ఎందుకు ఇవ్వలేదు..? అని ప్రశ్నించారు. పచ్చి బూతు పేపర్ నమస్తే తెలంగాణ. నేను బీఆర్ఎస్కు ఓటేయమని చెప్పానట. ఫస్ట్ తారీకు నాడు జీతాలిస్తే ఓటేయమన్న.. మరి ఇస్తున్నారా..? ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం, పేదలకు డబుల్ బెడ్ రూం ఇస్తే ఆ పార్టీకి ఓటేయమన్న. ఎందుకు ఇవన్నీ రాయలేదు..? అని ఫైర్ అయ్యారు. అభివృద్ధి చేస్తున్నది, చేసేది బీజేపీనే అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల కబ్జాలు, వేధింపులు భరించలేక అనేక కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు.
పూర్తిగా చదవండి..Telangana Politics: మెడమీద తలకాయ ఉన్నవాళ్లు బీఆర్ఎస్కి ఓటు వేయరు: బండి సంజయ్
తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉంది. అందుకే అమిత్షా బహిరంగ సభకు విపరీతమైన స్పందన వచ్చిందని బండి సంజయ్ అన్నారు. మా గ్రాఫ్ తగ్గినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. బీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉంది. అందుకే దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు ఆదరించారు. కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో అంతో ఇంతో అభివృద్ధి జరిగిదని బండి సంజయ్ తెలిపారు.

Translate this News:











