‘చంద్రముఖి’ సినిమా వచ్చి చాలా ఏళ్లు గడిచినా.. ఆ చిత్రాన్ని ఇంకా ప్రేక్షకులు ఎవరూ మరిచిపోలేదు. ఇప్పటికే ఈ సినిమా టీవీల్లో వేసినా.. అంతే ఇంట్రెస్టింగ్ చూస్తారు జనం. సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార, ప్రభు, జ్యోతి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ మూవీ.. అప్పట్లో రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. ఈ సినిమా విజయంలో విద్యాసాగర్ సంగీతం ప్రధానమైన పాత్రను పోషించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘చంద్రముఖి-2’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.
పూర్తిగా చదవండి..‘చంద్రముఖి-2’ నుంచి కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ రిలీజ్
తాజాగా శనివారం బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో కంగనా ఓ గదిలో దేన్నో తీక్షణంగా చూస్తూ నిలబడ్డారు. భయపెట్టే మాదిరి అయితే లేదు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చంద్రముఖి-2లో సీనియర్ కమెడియన్ వడివేలు కీలక పాత్రలో నటిస్తున్నాడు. మహిమా నంబియార్, లక్ష్మీ మీనన్, సిరుష్టి డాంగే, రావు రమేష్, విఘ్నేష్, రవి మారియా, సురేష్ మీనన్, సుభిక్షా కృష్ణన్ తదితరులు కీలక పాత్రలు..

Translate this News:











