Kangana Ranaut: మంత్రి రోజా (Minister Roja)పై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చంద్రముఖి-2 (Chandramukhi 2) ప్రమోషన్లో భాగంగా చిత్ర బృందం చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమెకు రోజా గురించి ప్రశ్న ఎదురైంది. రాజకీయాల్లోకి వస్తే సినిమాలను వదులుకోవాలంటూ జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను ఉద్దేశించి రోజా(Roja) వ్యాఖ్యలపై స్పందించాలని కంగనాను మీడియా ప్రతినిధులు కోరారు. దీంతో రోజా అంటే ఎవరు? అని కంగనా ఎదురుప్రశ్న వేశారు. ఆమె ఎవరో తనకు తెలియనప్పుడు… ఆమె గురించి తాను ఏం మాట్లాడతానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Kangana Ranaut: మంత్రి రోజాకు షాక్ ఇచ్చిన కంగనా.. ఆమె ఎవరో తెలియదు?
సినీ నటి, ఏపీ మంత్రి రోజాపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. రోజా అంటే ఎవరో తనకు తెలియదని అన్నారు. అలాంటివారు ఉన్నారన్న విషయమే తనకు తెలియదని.. ఆమె గురించి తానేం మాట్లాడతానని అన్నారు. ఇక రోజా తెలియదంటూ కంగనా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి.

Translate this News:











