kamareddy Marriage Incident:పెళ్ళిపీటలు ఎక్కాల్సిన పెళ్లి కొడుకు శవమై కనిపించాడు. కామారెడ్డి జిల్లా(kamareddy) ఎల్లారెడ్డిలో పెళ్లి సందడితో కళకళలాడుతున్న ఇంటిని ఒక్కసారిగా విషాదం కమ్మెసింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన మోసర్ల రాజేందర్(25) స్థానికంగా ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. ఇతనికి రెండు నెలల కింద నిజామాబాద్ జిల్లాకు చెందిన యువతితో పెండ్లి ఫిక్స్ అయింది. కుటుంబ సభ్యులంతా పెండ్లి పనుల్లో నిమగ్నమై శుభలేఖలు ప్రింట్ చేయించారు.
పూర్తిగా చదవండి..Kamareddy Marriage Incident: కాసేపట్లో పెళ్లి..ఈలోపే చెట్టుకు వేలాడుతూ..
పెళ్ళి భాజాలు మోగాల్సిన ఇంట.. చావు డప్పు మోగాల్సి వచ్చింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి గ్రామంలో జరిగిన ఈ ఘటన పెళ్ళింట విషాదాన్ని నింపింది.కాసేపట్లో పెళ్లనగా శవమై కనిపించాడు వరుడు.ఎల్లారం అటవీప్రాంతంలో చెట్టుకు ఉరేసుకున్నట్లుగా తెలుస్తోంది. కుళ్లిన స్థితిలో పెళ్లికొడుకు మృతదేహం లభ్యమవ్వడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. పెండ్లి శుభలేఖలు పంచి వచ్చిన రోజు నుంచి కనిపించకుండా పోయిన వరుడు సరిగ్గా పెండ్లి రోజే శవమై తేలాడు.

Translate this News:











