Kalvakuntla Shoba to Visit Tirumala: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సతీమణి కల్వకుంట్ల శోభ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. హైదరాబాద్ నుండి ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న అనంతరం ఆమె తిరుమల పయనం అవుతారు. తిరుమలలోని పద్మావతి విఐపి గెస్ట్ హౌస్ ఏరియాలో ఆమె కొద్దిసేపు ఉన్న అనంతరం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొంటారు. ఇప్పటికే టిటిడి అధికారులు ఆమెకు బస్సు ఏర్పాట్లతో పాటు దర్శన ఏర్పాట్లను చేశారు. కాగా, ఆమె ఒంటరిగా శ్రీవారిని దర్శించుకోవడం ఇప్పుడు మరో చర్చకు దారి తీస్తుంది. సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదనే వార్తలు వస్తున్న నేపథ్యంలో.. శోభ తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి రావడం అందరి దృష్టి కేసీఆర్ ఆరోగ్యంపై పడింది. కేసీఆర్ ఆరోగ్యం కోసం ఆమె శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిందా? సాధారణంగానే తిరుమలేశుడికి దర్శనం కోసం వచ్చారా? అనే చర్చ నడుస్తోంది.
పూర్తిగా చదవండి..Telangana: నేడు తిరుమలకు కల్వకుంట్ల శోభ.. ఆ మొక్కు చెల్లించేందుకేనా!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సతీమణి కల్వకుంట్ల శోభ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. హైదరాబాద్ నుండి ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న అనంతరం ఆమె తిరుమల పయనం అవుతారు. తిరుమలలోని పద్మావతి విఐపి గెస్ట్ హౌస్ ఏరియాలో ఆమె కొద్దిసేపు ఉన్న అనంతరం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొంటారు. ఇప్పటికే టిటిడి అధికారులు ఆమెకు బస్సు ఏర్పాట్లతో పాటు దర్శన ఏర్పాట్లను చేశారు.

Translate this News:











