కడప జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్ భార్యాపిల్లల్ని కాల్చి చంపి ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కో-ఆపరేటివ్ కాలనీలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటూ.. టూ టౌన్ పోలీస్ స్టేషన్లో గత రెండేళ్లుగా హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వెంకటేశ్వర్‌కు భార్య మాధవి, డిగ్రీ చదువుతున్న లాస్య , పదోతరగతి చదువుతున్న అభిజ్ఞ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అలాగే ఆయనకు రమాదేవి అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆమెకు వివాహం కాగా భర్త చనిపోయారు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు.
పూర్తిగా చదవండి..kadapa: ఆస్తులన్ని ఆమెకే.. కడప కానిస్టేబుల్ సూసైడ్ నోట్లో సంచలనం
కడపహెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఫ్యామిలీ హత్యల వెనుక రెండో భార్య రమాదేవి ఉన్నట్లు అనుమాలు వ్యక్తం చేశారు. వెంకటేశ్వర్లు మరణం అనంతరం రావాల్సిన బెనిఫిట్స్, ఉద్యోగం రెండో భార్య రమాదేవికి ఇవ్వాలని బాండ్లో కానిస్టేబుల్ కోరారు. సొంతూరులో ఉన్న భూమి కూడా రెండో భార్యకు రాసిచ్చిన వెంకటేశ్వర్లు.

Translate this News:











