Naresh Goyal Arrest : జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. కెనరా బ్యాంక్‌కు సంబంధించి 538 కోట్ల రూపాయల మోసం చేసిన కేసులో ఈడీ అతన్ని విచారించిన తర్వాత అరెస్టు చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం అరెస్టు చేసి శనివారం కోర్టులో హాజరుపరచనున్నారు. 74 ఏళ్ల గోయల్‌ను ముంబైలో శుక్రవారం ఈడీ సుదీర్ఘంగా విచారించింది. ఈ ఏడాది మేలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత విచారణ జరిగింది.. శుక్రవారం అర్థరాత్రి అతన్ని అరెస్టు చేసింది. ముంబైలోని ED కార్యాలయంలో సుదీర్ఘ విచారణ తర్వాత, గోయల్‌ను మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద అదుపులోకి తీసుకున్నారు.
పూర్తిగా చదవండి..Naresh Goyal Arrest : మనీలాండరింగ్ కేసులో జెట్‌ఎయిర్‌వేస్ ఎండీ గోయల్ అరెస్టు.!!
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యాడు. ఆయనపై రూ.538 కోట్ల మనీలాండరింగ్ కేసు నడుస్తోంది.

Translate this News:











