నేను ఎన్డీయేలో ఉంటే ఏంటి.. బయట ఉంటే ఏంటి.. మీకు ఎందుకు భయం అంటూ పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. ‘నీ సంగతి చూస్తాం కొడకా అంటూ మెసేజ్లు వచ్చాయి’ అని పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జనసేన పార్టీ వారాహి విజయ యాత్రలో భాగంగా నేడు కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం పరిధిలోని ముదినేపల్లి గురజా రోడ్డులో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. నువ్వెంత నీ బతుకెంత జగన్ అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చాలాసార్లు చెప్పి చూశాను:
ఎన్డీఏలో ఉన్నప్పటి నుంచి కేంద్ర పెద్దలకు ఒకే విషయాన్ని చాలాసార్లు చెప్పాను. 2014లో ఎలాగైతే జనసేన-టీడీపీ-బీజేపీ కలిసి ముందుకు వెళ్లాయో… అలా చేస్తేనే.. జగన్ ను ఓడించగలమని చాలాసార్లు చెప్పానన్నారు పవన్. రాష్ట్రాన్ని జగన్ అడ్డగోలుగా దోచేస్తున్నాడని కేంద్రానికి చాలాసార్లు చెప్పి చూశానాన్నారు. అమిత్ షాకు ఇదే మాట చెప్పాను, నడ్డాకు ఇదే మాట చెప్పానని.. బిజెపి పెద్దలందరికీ ఇదే చెప్పానన్నారు పవన్. నేను సనాతన ధర్మాన్ని ఆరాధిస్తానని.. ఎందుకంటే నా మతం ఇతర మతాలను గౌరవిస్తుందన్నారు. ఓవైపు వైసీపీ దేవాలయాలను కూల్చేస్తోందని.. రధాలు తగలబెట్టేస్తుంటే.. ఇప్పటివరకు జగన్ ప్రభుత్వం ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని ఆరోపించారు పవన్.
Pawankalyan: ‘నీ సంగతి చూస్తాం కొడకా అంటూ మెసేజ్లు వచ్చాయి’.. పవన్ సంచలన వ్యాఖ్యలు!
తన ఆఫీసుపై వైసీపీ గుండాలు దాడి చేస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించారు పవన్ కళ్యాణ్. కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం పరిధిలోని ముదినేపల్లి గురజా రోడ్డులో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. నేను ఎన్డీయేలో ఉంటే ఏంటి.. బయట ఉంటే ఏంటి.. మీకు ఎందుకు భయం అంటూ పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు.

Translate this News:











