రాజకీయాల్లో శత్రువులు, మిత్రులు అంటూ ఉండరన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రస్తుత పొత్తు ధర్మం ప్రకారం జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. పాత విషయాలను మనసులో పెట్టుకొని మనలో మనం గొడవలుపడితే కచ్చితంగా మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడని.. మన మధ్య లేనిపోని చిచ్చుపెట్టడానికి వైసీపీ సిద్ధంగా ఉందన్నారు. వారికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదన్నారు పవన్. లోక కళ్యాణం కోసం గరళం కంఠంలో నింపుకున్న పరమశివుడిలా ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర శ్రేయస్సు కోసం పరస్పరం సహకరించుకుంటూ పనిచేయాలని తెలిపారు. నేను కూడా సభ వేదికలపై జనసేన – తెలుగుదేశం అని సంబోధిస్తానని.. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వాళ్ల వేదికలపై తెలుగుదేశం- జనసేన అని చెబుతారన్నారు. ఇరువురి గౌరవాలకు ఏ మాత్రం భంగం కలగకుండా పొత్తును ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. 40 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని జనసేన కార్యకర్తలు తక్కువ అంచనా వేయకండని సూచించారు. వారి పార్టీ ప్రస్తుతం కష్టకాలం ఎదుర్కొంటుందని.. ఈ సమయంలో మిత్రధర్మం పాటిద్దామని పవన్ తెలిపారు. అలాగే పోరాటాలకు వేదిక అయిన జనసేన పార్టీని సైతం తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు సముచితంగా గౌరవించాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు.
పూర్తిగా చదవండి..Pawan kalyan: డబ్బు కోసమే చేస్తున్నాను.. సినిమాలు ఆపేస్తున్నానంటూ బాంబు పేల్చిన పవన్!
2008లో రాష్ట్రంలో మూడో రాజకీయ ప్రత్యామ్నాయాన్ని మొగ్గలోనే తుంచేశారని పవన్ అభిప్రాయపడ్డారు. మనవారే మనకి వెన్నుపోటు పొడిచారు. ఈ రోజు ప్రభుత్వం జనసేన మీద దాడులు చేయడానికి ఎందుకు ఆలోచిస్తుంది అంటే మనది పోరాట బలమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గొప్ప ఆత్మబలం ఉన్న రాజకీయ శక్తి జనసేన పార్టీని చెప్పారు. డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నాను... సినిమాలు సమీప భవిష్యత్ లో ఆపేస్తానని పవన్ తెలిపారు.

Translate this News:











