AP politics pawan tdp alliance: ఏపీ రాజకీయాలు రంజుగా మారాయి. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ తర్వాత పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీతోనే కలిసి వెళ్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టిన్నట్టు మాట్లాడడంతో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. అటు బీజేపీ వ్యూహాత్మక మౌనం కొనసాగిస్తోంది. బీజేపీ కూడా తమతోనే కలిసి వస్తుందని పవన్ చెప్పగా.. ఇప్పటివరకు ఈ విషయంపై అటు ఏపీ బీజేపీ పెద్దల నుంచి కానీ హైకమాండ్ నుంచి కానీ క్లారిటీ రాలేదు. పొత్తుల విషయం కేంద్ర పెద్దలే నిర్ణయిస్తారని ఏపీ బీజేపీ ప్రకటన విడుదల చేయడం తప్ప ఇప్పటివరకు ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు.
పూర్తిగా చదవండి..JANSENA TDP Alliance: నీకు సగం… నాకు సగం.. సీఎం పదవి షేర్ చేసుకుందాం బాసూ..!
టీడీపీ, జనసేన పొత్తుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పవన్ చేసిన పవర్ షేరింగ్ హాట్‌టాపిక్‌గా మారింది. అటు సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్టేనన్న అనుమానం కలుగుతోంది. 25 నుంచి 40 సీట్లను జనసేన అడిగే ఛాన్స్ ఉంది. రెండున్నరేళ్లు సీఎం పదవి కోసం జనసేన పట్టుబడుతోంది. రెండున్నరేళ్లు సీఎం పదవి ఇస్తేనే పూర్తిస్థాయిలో పొత్తు ఉంటుందని జనసేన చెప్పినట్టు సమాచారం.

Translate this News:











