Nagababu: వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సీఎం జగన్ దిట్ట అని జనసేన నాయకుడు నాగబాబు ఆరోపించారు. తిరుపతి, శ్రీకాళహస్తి నియోజక వర్గాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ మాటలు విని అధికారులు తప్పులు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు తప్పు చేసే ప్రతి అధికారి భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ధర్మో రక్షతి రక్షితః అనే సిద్ధాంతాన్ని ఆచరిస్తే… జగన్ మాత్రం ధనమో రక్షతి రక్షితః అనే సిద్ధాంతాన్ని నమ్ముతారని విమర్శించారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా అధికారులకు ఆరు నెలలు సమయం ఇస్తున్నామని.. పద్ధతి మార్చుకోవాలని సూచించారు. వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే ఆంధ్ర రాష్ట్రం అథోగతి పాలైందని.. మరోసారి ఛాన్స్ ఇస్తే ప్రజల ఆస్తులను లాక్కుంటారని మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..Nagababu: వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సీఎం జగన్ దిట్ట: నాగబాబు
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సీఎం జగన్ దిట్ట అని జనసేన నాయకుడు నాగబాబు ఆరోపించారు. తిరుపతి, శ్రీకాళహస్తి నియోజక వర్గాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ మాటలు విని అధికారులు తప్పులు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

Translate this News:











