మచిలీపట్నం జనవాణి అనంతరం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. జనసేన చేపట్టిన వారాహి విజయ యాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని జగన్ ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. అల్లరి మూకలతో గొడవలు సృష్టించి భయబ్రాంతులకు గురి చేయాలని, కేసులతో ఇబ్బందులు పెట్టాలని ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం ఉందని ఆరోపించారు. నాకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు.. బుధవారం జరగబోయే పెడన నియోజకవర్గ వారాహి విజయయాత్ర సభలో రౌడీమూకలు, గూండాలు, అల్లరి మూకలను దించి సభపై రాళ్ల దాడి చేయించాలని సీఎం జగన్ ప్రభుత్వం పకడ్బందీగా ప్లాన్ చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. సభలో ఎలాంటి అలజడులు సృష్టించినా.. దానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మచిలీపట్నంలో మంగళవారం నిర్వహించిన జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో అర్జీలు స్వీకరించిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘వైసీపీ నాయకుడికి, డీజీపీకి, హోంమంత్రికి, పోలీస్ అధికారులకు స్పష్టంగా చెబుతున్నా.. పెడన సభలో కనుక ఏవైనా గొడవలు పెట్టుకోవాలని చూస్తే ఏ మాత్రం సహించేది లేదన్నారు. ఏం జరిగినా..? వారే పూర్తిగా బాధ్యత తీసుకోవాలంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
పూర్తిగా చదవండి..ap political: రాబోయే ప్రభుత్వం జనసేన-టీడీపీదే.. జగన్ సర్కార్కు పవన్ కల్యాణ్ వార్నింగ్
వారాహి విజయయాత్రలో అల్లర్లు సృష్టించేందుకు జగన్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని పవన్కళ్యాణ్ ఆరోపించారు. రేపటి పెడన సభలో గొడవలు సృష్టించేందుకు ప్రణాళిక చేస్తున్నారని మండిపడ్డారు. వారాహి విజయయాత్రను అడ్డుకోవడమే జగన్ లక్ష్యం మన్నారు. జన సైనికులు, తెలుగుతమ్ముళ్లు.. అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ కోరారు.

Translate this News:











