Janagama: జనగామ జిల్లా పాలకుర్తి మడలం వల్మిడి గ్రామంలోని గుట్టపైన శ్రీసీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. జనగామ జిల్లాలో పునః నిర్మించిన శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో వేదమంత్రోచ్ఛరణల నడుమ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి సీతారాముల విగ్రహ ప్రతిష్ట చేశాడు. గుడి నిర్మాణానికి కృషి చేసిన మంత్రిని జీయర్ స్వామి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దగ్గరుండి పర్యవేక్షించారు. నూతనంగా నిర్మించిన ఆలయంలో హోమగుండ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. నాలుగు రోజులుగా శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఆలయ పునరుద్దరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు ఖర్చు చేసింది.
పూర్తిగా చదవండి..Janagama: గొప్ప కార్యానికి వేదికైన పాలకుర్తి సోమనాథుడి స్వస్థలం
వల్మిడి గ్రామంలో ఘనంగా సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు జరిగాయి. జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం చారిత్రక వల్మిడి గ్రామంలోని గుట్టపైన శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో త్రిదండి చినజీయర్ స్వామి పాల్గొన్నారు.

Translate this News:











