Jahnavi Death: అమెరికాలో తెలుగు యువతి కందుల జాహ్నవి మృతిపై అక్కడి పోలీసులు అసభ్య పదజాలం వాడిన ఘటన దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది. తాజాగా ఈ ఘటనను ఖండిస్తూ ఏపీ సీఎం జగన్ విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. కందుల జాహ్నవి మృతిపై యూఎస్ పోలీసులు కామెంట్లు చేయడం దారుణమని.. అమాయక యువతి మరణాన్ని అపహాస్యం చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. అమెరికాలో చదువుకునే భారతీయ విద్యార్థుల్లో ధైర్యం కల్పించాలంటే… తప్పు చేసిన పోలీసు అధికారిపై కఠిన చర్యలకు సిఫార్సు చేయాలని విజ్ఞప్తిచేశారు. ఈ కేసును పూర్తిగా దర్యాప్తు చేయించాలని అభ్యర్థించారు. నిజాలను బయటకు తీసుకొచ్చి జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. తక్షణమే భారత్‌లోని అమెరికా రాయబారితో సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు సూచించాలని జగన్ మన్నవి చేశారు.
పూర్తిగా చదవండి..Jahnavi Death: అమెరికాలో జాహ్నవి మృతి ఘటనపై కేంద్రమంత్రికి సీఎం జగన్ లేఖ
అమెరికాలో తెలుగు యువతి కందుల జాహ్నవి మృతిపై అక్కడి పోలీసులు అసభ్య పదజాలం వాడిన ఘటన దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది. తాజాగా ఈ ఘటనను ఖండిస్తూ ఏపీ సీఎం జగన్ విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. కందుల జాహ్నవి మృతిపై యూఎస్ పోలీసులు కామెంట్లు చేయడం దారుణమని.. అమాయక యువతి మరణాన్ని అపహాస్యం చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

Translate this News:











