హైదరాబాద్(Hyderabad)లో చిట్‌ఫండ్స్(Chit Funds), ఫైనాన్స్ కంపెనీలే టార్గెట్‌గా ఐటీ సోదాలు(IT Raids) కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి ఐటీ సోదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎల్లారెడ్డిగూడ పూజ చిట్‌ఫండ్స్ కంపెనలో సోదాలు చేశారు అధికారులు. పూజ కృష్ణ చిట్ ఫండ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పైనా దాడులు జరిగాయి. కృష్ణ ప్రసాద్, దొప్పలపుడి పూజా, సోమేపల్లి నాగ రాజేశ్వరి, పూజ కృష్ణ, జీవన్ శక్తి, ఈ కామ్ చిట్‌ఫండ్స్ కంపెనీల్లోనూ సోదాలు చేశారు.
100 బృందాలుగా విడిపోయి సోదాలు:
ఐటీ అధికారులు 100 బృందాలుగా విడిపోయి గురువారం ఉదయం నగరంలోని పలు కంపెనీలు, ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున వెతకడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా చిట్ ఫండ్, ఫైనాన్స్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని సోదాలు కొనసాగుతున్నాయి. అమీర్ పేట, కూకట్ పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, శంషాబాద్ లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అమీర్ పేటలోని ఎల్లారెడ్డిగూడలో పూజాకృష్ణ చిట్ ఫండ్ ను 20 బృందాలు తనిఖీ చేస్తున్నాయి.
IT Raids: ఆ చిట్ కంపెనీల్లో నోట్ల కట్టలు.. ఐటీ దాడుల్లో సంచలనాలు..!
హైదరాబాద్ లో ఐటీ సోదాలు మరోసారి కలకలం రేపాయి. కూకట్ పల్లిలోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఆయన సోదరుల ఇళ్లలో సోదాలు జరగడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐటీ అధికారులు 100 బృందాలుగా విడిపోయి గురువారం ఉదయం నగరంలోని పలు కంపెనీలు, ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ప్రధానంగా చిట్ ఫండ్, ఫైనాన్స్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని సోదాలు కొనసాగుతున్నాయి.

Translate this News:











