ఈ మధ్యకాలంలో చాలామంది యువతీయువకులు ఐటీ జాబ్స్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే ఐటీ సంస్థలు కూడా ఫ్రెషర్లకు భారీగా ఆఫర్లు ఇస్తున్నాయి. అయితే గత కొన్ని నెలలుగా ఐటీ ఉద్యోగం కోసం వెతికేవారికి గడ్డుకాలం నడుస్తోంది. అలాగే రాబోయే ఆరు నెలలు కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం దిగ్గజ ఐటీ కంపెనీలు ఫ్రెషర్ల నియామకాన్ని తగ్గించాయి. ఇక ఆర్థిక అనిశ్చితులను పరిగణలోకి తీసుకుంటే.. ఈ ఆర్థిక ఏడాది రెండవ అర్ధభాగంలో గతంలో ఎప్పుడు లేని విధంగా మరింత తక్కువగా ఉంటాయిని భావిస్తున్నారు నిపుణులు. ప్రస్తుతం క్లయింట్లు కూడా ఖర్చులను తగ్గించుకుంటున్న తరుణంలో కంపెనీలు తాము ఇప్పటికే చేసిన అన్ని జాబ్ ఆఫర్లను గౌరవిస్తూ విధుల్లోకి తీసుకోవాలని.. అలాగే ఇప్పుడు బెంచ్‌లో ఉన్నవారిని కూడా పూర్తిగా వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి.
పూర్తిగా చదవండి..IT Jobs: ఐటీ ఉద్యోగం కోసం చూస్తున్నారా.. ఇక అంతే సంగతులు
ప్రస్తుతం ఐటీ ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు గడ్డుకాలం నడుస్తోంది. ఇప్పటికే ప్రముఖ ఐటీ కంపెనీలు ఫ్రెషర్ల నియామకాన్ని తగ్గించేశాయి. అయితే రాబోయే ఆరునెలల్లో కూడా ఐటీ ఉద్యోగం వెతుక్కునే వారికి మరింత గడ్డుకాలం ఉండనుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే చాలావరకు పలు ఐటీ కంపెనీలు క్యాంపస్ నియామకాల కోసం వెళ్లకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

Translate this News:











