TTD chairman controversy: టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని ఎలా నియమిస్తారని బీజేపీ, టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ అని, ఎన్నికల అఫిడవిట్లో కూడా క్రిస్టియన్‌గా పేర్కొన్నారని వైసీపీకి వ్యతిరేకంగా మండిపడుతున్నారు. ఓ అన్యమతస్తుడిని తిరుమల బోర్డుకు చైర్మన్‌గా ఎలా నియమిస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ విషయంలో రాజీ లేకుండా పోరాడుతామని , కరుణాకర్ రెడ్డిని పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిలో ఎలా కూర్చోబెడతారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి నిలదీస్తున్నారు. ఇంతకు ముందు ఈ ప్రభుత్వం 80 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి నియామకం చేయడం జరిగిందనీ, ఆ విషయంపై గలం విప్పిన తర్వాత 52 మంది నియామకం నిలిపి వేయడం జరిగిందన్నారు. అంటే ప్రభుత్వం ఈ నియామకాలను రాజకీయ పునరావాస నియామకాలుగానే పరిగణిస్తున్నదని అర్దమవుతున్నదని అన్నారు హిందూ ధర్మం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తికే ఇలాంటి బాధ్యతలు అప్పగించాలి కానీ.. వేరే మతానికి చెందిన వారిని ఎలా నియమిస్తారన్న విమర్శలు పెరిగిపోతున్నాయి.
పూర్తిగా చదవండి..ఆగని రచ్చ.. టీటీడీ ఛైర్మన్‌గా భూమన నియామకంపై చల్లారని మంటలు
టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి నియామకంపై మాటలు మంటలు కొనసాగుతున్నాయి. ఓ అన్యమతస్తుడిని పవిత్రమైన టీటీడీ ఛైర్మన్‌గా ఎలా నియమిస్తారని విపక్షాలు మండిపడుతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు వైసీపీ టార్గెట్‌గా ఫైర్ అవుతున్నారు. ఇక రేపు(ఆగస్టు 10) టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న భూమన కరుణాకర్ రెడ్డి.. ఇప్పటికే జగన్‌ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Translate this News:











