చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా చంద్రుడి ఉపరితలంపై విక్రం ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్నాన్ రోవర్ లు ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు అక్కడ పరిశోధనలు చేస్తూ..విలువైన సమాచారాన్ని సేకరించాయి. అంతేకాదు జాబిల్లికి సంబంధించి అరుదైన ఫొటోలను కూడా పంపించాయి. అయితే సెప్టెంబర్ 4 నుంచి చంద్రుడిపై రాత్రి సమయం ప్రారంభం అవ్వడంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్నాన్ రోవర్లను ఇస్రో నిద్రావస్థలోకి పంపించింది.
పూర్తిగా చదవండి..Chandrayaan-3 Sleep: ల్యాండర్, రోవర్ సంకేతాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోన్న ఇస్రో..!!
ల్యాండర్, రోవర్ నుంచి సంకేతాలను పునరుద్ధరించేందుకు ఇస్రో తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెల 22 నుంచి చంద్రుడిపై సూర్యుడు ప్రకాశించడంతో శాస్త్రవేత్తలు వాటిని యాక్టివేట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు 2019లో చైనాకు చెందిన ల్యాండర్ చాంగ్ 4 రోవర్ యుటు 2ను మేల్కోపినట్లు నిపుణులు తెలిపారు. అయితే దక్షిణ ధ్రువంపై పరిస్థితులు వేరని...యాక్టివేట్ పై ఆశలు చాలా తక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా విక్రమ్, ప్రజ్ఞాన్ ఆటోమేటిక్గా మేల్కొంటాయాని ఇస్రో తెలిపింది.

Translate this News:











