ISRO Somnath about Chandrayaan-3 Pragyan Rover: ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేప్టటిన చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయవంతవమై ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా చేసిన సంగతి తెలిసిందే. చంద్రుని దక్షణ ధృవంపై తొలిసారి అడుగుపెట్టిన పెట్టిన దేశంగా భారత్ చరిత్రను సృష్టించింది. ఇటీవల అక్కడ 14 రోజుల పాటు ప్రయాణించిన ప్రజ్ఞాన్ రోవర్ కీలకమైన విషయాలను ఇస్రోకు (ISRO) పంపించింది. జాబిల్లి ఉపరితలంపై ఆక్సిజన్‌తో సహా సల్ఫర్ ఉన్నట్లు గుర్తించింది. అయితే 14 రోజులు పూర్తైన తర్వాత ల్యాండర్, రోవర్లో నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోయాయి.
పూర్తిగా చదవండి..Chandrayaan-3: రోవర్ మేల్కొనే అవకాశాలు ఉన్నాయి.. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోవర్ మళ్లీ క్రియాశీలకంగా మారే అవకాశాలు కొట్టివేయలేమని.. అది నిద్రలేవడంపై ఇప్పటికీ కూడా తమ ఆశలు సజీవంగానే ఉన్నాయని పేర్కొన్నారు. కొచ్చిలోని మలయాళ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సోమనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Translate this News:











