భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గగన్‌యాన్ ప్రాజెక్టు చేపట్టనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుపై ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టులో అధిక ప్రాధాన్యం మహిళలకు ఇచ్చే యోచనలో ఉన్నామని పేర్కొన్నారు. మహిళా టెస్టు ఫైలట్లు, మహిళా శాస్త్రవేత్తలను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తామని తెలిపారు. ఇక వచ్చే ఏడాది మానవ రహిత గగన్‌యాన్ స్పేస్ క్రాఫ్ట్‌లో ఫీమేల్ హ్యూమనాయిడ్‌ను పంపిస్తామని చెప్పారు. అయితే ఇది మనిషిని పోలి ఉండే రోబో. వాస్తవానికి గగన్‌యాన్ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపిచి.. అక్కడ 3 రోజుల పాటు వారిని ఉంచి తీసుకురావడం. అయితే ఈ ప్రాజెక్టులో మహిళలకు చోటు ఇస్తామని.. అయితే అది సాధ్యం కావడానికి అందుకు తగ్గ అభ్యర్థులు దొరకాలని చెప్పారు సోమనాథ్.
పూర్తిగా చదవండి..Gaganyaan: గగన్‌యాన్ ప్రాజెక్టులో మహిళలకు ప్రాధాన్యం: ఇస్రో ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు
ఇస్రో చేపట్టనున్న గగన్‌యాన్ ప్రాజెక్టులో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన వారిని ఫైటర్ టెస్ట్ అభ్యర్థులుగా ఎంపిక చేస్తున్నామని.. వాళ్లు వివిధ కేటగిరీల నుంచి ఉన్నారని తెలిపారు. అయితే ఇప్పుడు మహిళా ఫైటర్ టెస్టు ఫైలట్లు అందుబాటులో లేరని.. వారు ముందుకు వచ్చినట్లైతే ఓ మార్గం సుగమం అవుతుందంటూ సోమనాథ్ తెలిపారు. అలాగే ఈ ప్రాజెక్టులో మహిళలను భాగం చేసేందుకు రెండో ఎంపిక శాస్త్రీయ కార్యకలాపాలతో ఉంటుందని.. అయితే ఈ ఎంపికలో శాస్త్రవేత్తలే వ్యోమగాములుగా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పారు.

Translate this News:











