గాజాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తున్న వేళ.. తమ కార్యకలాపాలకు భారత్ మద్దతు ఇవ్వడంపై ఇజ్రాయెల్ హర్షం వ్యక్తం చేసింది. అలాగే హమాస్‌పై భారత్ కూడా కఠిన వైఖరిని అనసరించాలని అభ్యర్థిస్తోంది. ఇతర దేశాలు చేసినట్లుగానే భారత్ కూడా హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఇండియాలో ఉన్న ఇజ్రాయెల్ రాయబారి నవోర్ గిలాన్ ఈ విధంగా మాట్లాడారు. ముఖ్యమైన దేశాలన్ని కూడా మనతోనే ఉన్నాయి. అవి ప్రజాస్వామ్య దేశాలు. అయితే ఇప్పుడు ఇండియా కూడా హమాస్‌ను ఉగ్రసంస్థగా గుర్తించాల్సిన సమయం వచ్చిందని నేను భావిస్తున్నాను అని మీడియాతో మాట్లాడుతూ గిలన్ వ్యాఖ్యానించారు.
పూర్తిగా చదవండి..Israel-Hamas War: హమాస్‌ను ఉగ్రసంస్థగా గుర్తించాలని భారత్‌ను కోరిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తున్న వేళ.. భారత్ తమకు మద్దతు ఇవ్వడంపై ఇజ్రాయెల్ రాయబారి హర్షం చేశారు. ఇప్పుడు భారత్ కూడా హమాస్‌ను ఉగ్రసంస్థగా గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని తాను భావిస్తున్నానని అన్నారు. అయితే ఇది ఒకరు ఒత్తిడి తెచ్చే అంశం కాదని.. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, ఇతర వ్యూహాత్మక విషయాల్లో ఇజ్రాయెల్-భారత్ ఒకే రకమైన అభిప్రాయాలతో ఉన్నాయని చెప్పారు.

Translate this News:











