యుద్ధం అంటే వినాశనమే.. యుద్ధం అంటే విధ్వంసమే.. యుద్ధం అంటే విషాదమే..! రెండు స్వార్థ ముఠాల మధ్య, స్వార్థ గ్రూపుల మధ్య, స్వార్థ దేశాల మధ్య సామాన్యులు నలిగిపోయే రాక్షస క్రీడ యుద్ధం. ఇజ్రాయెల్(israel)-పాలస్తీనా(palestine) యుద్ధం అభంశుభం తెలియని చిన్నారులను పొట్టనపెట్టుకుంటోంది. అమాయకులు, లోకాన్ని ఇంకా చూడని వారు, పసిపిల్లలు, చిన్నారులు, విద్యార్థులు, ఆడవాళ్లు ఇలా ప్రతి ఒక్కరూ బాంబు దాడులకు బలైపోతున్నారు. ఏ నిమిషం ఎటు వైపు నుంచి ఎవరూ వస్తారో తెలియదు.. ఏ బాంబు మీద పడుతుందో అర్థంకాదు.. ఇల్లు దాటి బయటకు వెళ్తే తిరిగి వస్తామో లేదో గ్యారెంటీ లేదు. హమాస్ తీవ్రవాదులు, ఇజ్రాయెల్ దళాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో ఏ మాత్రం సంబంధంలేని వారు చనిపోవడం అత్యంత విషాదకరం. సోషల్‌మీడియా ఓపెన్ చేసి చూడాలంటే సామాన్యులకు భయం వేస్తున్న పరిస్థితి దాపరించింది. ఏ వీడియోలో ఏ చిన్నారి చనిపోయిందో తెలియదు.. ఏ విద్యార్థి కిడ్నాప్‌కు గురయ్యాడో అర్థంకాదు.. తాజాగా యుద్ధంలో జరిగిన దారుణానికి సంబంధించిన ఓ వార్త కన్నీరు పెట్టిస్తోంది. జరుగుతున్న యుద్ధంలో 40మంది చిన్నారులు అత్యంత క్రూరంగా హత్యకు గురయ్యారు.
పూర్తిగా చదవండి..Hamas Horrors: 40 మంది చిన్నపిల్లల తలలను నరికేశారు… ఇది యుద్ధం కాదు మారణహోమం…!
ఇజ్రాయెల్ సైన్యం హమాస్ తీవ్రవాదుల మధ్య జరుగుతున్న పోరులో అమాయకులు తనువు చాలిస్తున్నారు. 40మంది శిశువులను హమాస్ తీవ్రవాదులు చంపేసినట్టు ఇజ్రాయెల్ మీడియా రిపోర్ట్ చేసింది. వారిలో చాలామంది శిశువుల తలలు నరికేసి ఉన్నాయి. అభంశుభం తెలియని చిన్నారులను ఇంత కిరాతకంగా చంపడం నిజంగా బాధాకరం. కిబ్బత్జ్ క్ఫర్ అజా అనే ప్రాంతంలో జరిగిందీ ఘటన.

Translate this News:











