‘అమ్మా మంచినీళ్లు కావాలి.. ఇంట్లో తాగడానికి నీళ్లు ఎందుకు లేవు.. మొన్నటివరకు ఉన్నాయి కదా.. నాకు దాహంగా ఉందమ్మా..’ ఇది గాజా(Gaza Strip)లో సగటు పసివాడి నరకవేదన. తన్నుకు చస్తుంది పెద్దవాళ్లు.. దాహంతో నోరు ఎండిపోతుంది మాత్రం చిన్నారులకు. తాగడానికి నీళ్లు లేక గాజాలో చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇజ్రాయెల్(Israel)-హమాస్(Hamas) పోరు చిన్నారుల ప్రాణం మీదకు తీసుకొచ్చింది. మనిషికి అన్నిటికంటే ముఖ్యమైనది నీరు మాత్రమే. తినకుండా అయినా కొంతకాలం బతకచ్చుకానీ.. తాగే నీరు లేకపోతే మాత్రం బతుకులు అక్కడే కూలిపోతాయి.
పూర్తిగా చదవండి..Israel Vs Palestine: పాపం పసివాళ్లు.. మంచినీళ్లు లేక చనిపోయే పరిస్థితులు..!
హమాస్‌పై ప్రతీకార చర్యల్లో భాగంగా గాజాకు ఇజ్రాయెల్ ప్రధాన సరఫరాలన్ని నిలిపివేసింది. అందులో నీరు కూడా ఉండడంతో అక్కడి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. మంచినీరు కోసం చిన్నారులు బారుల తీరిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. గాజా జనాభాలో 47శాతం మంది 17ఏళ్ల లోపు వారే ఉండడం..వారందరికి ఇప్పుడు తాగడానికి నీళ్లు లేకపోవడం కలవరపెడుతోంది

Translate this News:











