Israel Hamas War: యుద్ధభూమి మరుభూమిగా మారడం మునపెన్నుడూ చూడని విషయం. చరిత్రలో ఏ యుద్ధం చూసినా బలైపోయింది అమాయకులే. వేల సంవత్సరాల నుంచి యుద్ధంలో జరుగుతున్న ఘటనలు చూస్తే ఈ విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతుంది. అప్పుడెప్పుడో జరిగిన వార్లు గురించి ఎందుకు.. మొన్న మొదలైన యుక్రెయిన్-రష్యా యుద్ధమైనా నిన్న మొదలైన ఇజ్రాయెల్(Israel)-పాలస్తీనా(Palestine) వార్ అయినా జరుగుతున్నది అదే కదా.. సామాన్యుల నెత్తుర కళ్ల చూసేది యుద్ధమే. హమాస్(Hamas) మిలిటెంట్ల దాడి తర్వాత ఎదురు దాడికి దిగిన ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో మిలిటెంట్లతో పాటు సామాన్యులు సైతం తనువు చాలిస్తున్నారు. ఈ మరణాలు అటు పాలస్తీనా, ఇటు ఇజ్రాయెల్‌లోని సామాన్యులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. నరక వేధనను మిగిలిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Israel Hamas War: యుద్ధంలో తెగిపడుతున్న తలలు.. కన్నీళ్లు పెట్టిస్తోన్న వీడియోలు..!
ఇజ్రాయెల్-పాలస్తీనాకు యుద్ధానికి చెందిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఇటు ఇజ్రాయెల్ సైనికులు, అటు హమాస్ మిలిటెంట్ల మధ్య సామాన్యులు బలైపోతున్నారు. ఇక సోషల్‌మీడియాలో యూజర్లు రెండు వర్గాలుగా చీలిపోయి పోస్టులు పెట్టుకుంటున్నారు. ద్వేషాన్ని పెంచేలాగా ఆ పోస్టులు ఉంటున్నాయి.

Translate this News:












