ఆమె పేరు యోచివెడ్ లిఫ్షిట్జ్(Yocheved Lifshitz), వయసు 85.. హమాస్(Hamas) విడుదల చేసిన ఇద్దరు ఇజ్రాయెలీ బందీలలో ఈ భామ్మ ఒకరు. హమాస్-ఇజ్రాయెల్(Israel) మధ్య భీకర పోరులో దాదాపు 400మందిని హమాస్ దళాలు బందీలు చేయగా.. ఇప్పటివరకు నలుగురిని విడుదల చేశారు. అందులో ఇద్దరిని ఇవాళే(అక్టోబర్ 24) విడుదల చేయగా.. అందులో ఒకరైన 85ఏళ్ల యోచివెడ్ అసలేం జరిగిందో వివరించారు. కిడ్నాప్ చేసే సమయంలో తనను బాగా కొట్టారని ఆ భామ్మ చెప్పుకొచ్చింది. నొప్పి తట్టుకోలేకపోయానని.. నరకం అనుభవించానని వాపోయింది. నిజానికి మూడు వారాల ముందే మమ్మల్ని హమాస్ మిలిటెంట్లు హెచ్చరించారని.. తమ పొలాలను కూడా ధ్వంసం చేశారని భామ్మ చెప్పింది. ఫైర్ బెలూన్లను పంపినా కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(Israel Defence Forces) హమాస్ చర్యను తీవ్రంగా పరిగణించలేదని భామ్మ ఆరోపించింది. ఆమె మొత్తం మాట్లాడిన స్టేట్మెంట్లు వింటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో అర్థమవుతుందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పూర్తిగా చదవండి..Israel vs Hamas: నొప్పితో విలవలలాడిపోయాను.. 85 ఏళ్ల భామ్మ ఏం చెప్పిందంటే?
ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న భీకర పోరులో అమాయకులు బలైపోతున్నారు. 400మందికి పైగా ఇజ్రాయెలీ పౌరులను గాజాలని సొరంగాల్లో హమాస్ బంధించిన విషయం తెలిసిందే. వారిలో ఇద్దరిని తాజాగా హమాస్ విడుదల చేసింది. అందులో 85ఏళ్ల భామ్మ అసలేం జరిగిందో వివరించింది. సొరంగాల్లో బందీగా ఉన్నప్పుడు ఓ డాక్టర్ తనకు వైద్య పరీక్షలు నిర్వహించేవారని చెప్పింది. హమాప్ మిలిటెంట్లు తమని మంచిగానే చూసుకున్నారని తెలిపింది.

Translate this News:











