Kerala woman in Israel: ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు దాదాపు 3 వేల మందికి పైగా ఇజ్రాయెల్, పాలస్తీనీయన్ పౌరులు చనిపోయారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని.. ఇరు దేశాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తాజాగా కేరళ మహిళల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన సబిత, మీరా మోహన్ అనే ఇద్దరు మహిళలు ఇజ్రాయెల్‌లో కేర్ గీవర్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల గాజా సరిహద్దుల్లో నీర్ ఓజ్ అనే కిబుట్జ్లోకి హమాస్ మిలిటెంట్లు చొరబడి దాడులకు పాల్పడినప్పుడు వారు అక్కడే పనిలో ఉన్నాయి. ఆ సమయంలోనే వారిద్దరు ఓ వృద్ధురాలిని హమాస్ దాడుల నుంచి రక్షించగలిగారు. వారి ధైర్యాన్ని కొనియాడుతూ భారత్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీ తాజాగా ఎక్స్‌లో ఓ వీడియోను పోస్టు చేసింది. ఆరోజు ఎదుర్కొన్న భీకర పరిస్థితులను సబిత ఆ వీడియోల తెలియజేశారు.
Also Read: ఆసుపత్రిపై దాడి మిలిటెంట్ల పనే- ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు
పూర్తిగా చదవండి..











