బాంబుల మోత.. అడుగుతీసి అడుగు బయటకు వెయ్యలేని పరిస్థితి.. ఏ వైపు నుంచి ఏ ముప్పు తన్నుకోస్తుందో తెలియని దుస్థితి.. నిన్నమొన్నటివరకు యుద్ధంపై భయాలు ఇలానే ఉన్నా అవి వాస్తవరూపం దాల్చుతాయని అక్కడి ప్రజలకు తెలియదు పాపం. ఇజ్రాయేల్-పాలస్తీనా(Israel Palestine) యుద్ధం భీకర స్థితికి చేరుకుంది. గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇరు వైపుల నుంచి ఇప్పటివరకు 298మంది మరణించినట్టు సమాచారం. తాజాగా ఇజ్రాయేల్‌పై హమాస్ 150రాకెట్లతో విరుచుకుపడింది. ఈ విషయాన్ని హమాసే గర్వంగా చెప్పుకుంది. ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ కూడా తాజా దాడిని రిపోర్ట్ చేసింది. ఇజ్రాయెల్‌పై సంవత్సరాలలో హమస్ చేసిన అతిపెద్ద దాడి ఇదే!
పూర్తిగా చదవండి..Israel Palestine Conflict: ఒళ్లు గగుర్పొడిచేలా వార్ వీడియోలు..భయంకర దాడులు.. 298 మంది మృతి..!
ఇజ్రాయేల్-పాలస్తీనా మధ్య జరుగుతున్న పోరు భీకర స్థాయికి చేరుకుంది. ఇప్పటివరకు ఇరు వైపుల ఉంచి 298 మంది మరణించినట్టు సమాచారం. 20 నిమిషాల్లో దాదాపు 5వేల రాకెట్లతో దాడి చేసిన హమాస్ మరోసారి 150 రాకెట్లతో విరుచుకుపడడంతో ఇజ్రాయేల్ దెబ్బకు దెబ్బ కొట్టాలని కాపు కాచుకోని కూర్చోంది. హమాస్ చీఫ్ ఇంటిపై ఇజ్రాయేల్ దాడి చేసినట్టు సమాచారం.

Translate this News:











