గాజాలో హమాస్ స్థావరాల మీద ఇజ్రాయెల్ వరుసపెట్టి దాడులు చేస్తూనే ఉంది. గాజాస్ట్రిప్ లో అడుగుపెట్టి ఇల్లిల్లూ గాలిస్తూ మరీ మెరుపు దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో హమాస్ చెరలో బందీగా ఉన్న తమ దేశ సైనికురాలు ఒరి మెగిదిష్‌ను ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్స్ విడిపించుకుంది. అక్టోబర్ 7న హమాస్ ఈమెను అపహరించింది. ఒరి మెగదీష్ ను విడిపించుకున్నాక తమ దేశం తీసుకువెళ్ళి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ఆరోగ్యంగానే ఉంది. వైద్య పరీక్షలు అనంతరం ఆమెను తన తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. మెగదిష్ తన కుటుంబ సభ్యులతో ఉన్న ఫోటోను ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
పూర్తిగా చదవండి..Israel:హమాస్ చెర నుంచి తమ దేశ సైనికురాలిని విడిపించుకున్న ఇజ్రాయెల్
హమాస్, ఇజ్రాయెల్ మధ్య దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాలో బీభత్సం సృష్టిస్తోంది. ఈక్రమంలో తమ దేశానికి చెందిన ఓ సైనికురాలిని సైన్యం విడిపించుకుంది. మరోవైపు గాజాలో కాల్పుల విరమణ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.

Translate this News:











