ఇజ్రాయెల్-హమాస్ ల మధ్య యుద్ధం మొదలై పదిహేను రోజులు అయింది. ఇన్ని రోజులుగా ఒకరి మీద ఒకరు విరుచుకుపడుతున్నారు. హమాస్ మొదలెట్టిన మారణకాండను ఇజ్రాయెల్ కంటిన్యూ చేస్తోంది. గాజాలో దాక్కున్న మిలిటెంట్లను ఏరిపారేయాలని…వారి దగ్గర బందీలుగా ఉన్న తమ దేశస్థులను కాపాడుకోవాలని ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పటివరకు ఇరు పక్షాలు వైమానిక దాడులను మాత్రమే చేసుకున్నారు. గాజా సరిహద్దుల్లో తమ యుద్ధ ట్యాంకర్లు, పదాధిదళపతులను మోహరించినప్పటికీ ఇప్పటివరకూ దాడి చేయలేదు. కానీ నిన్న ప్రత్యక్ష యుద్ధం జరిగిందని హమాస్ చెబుతోంది.
పూర్తిగా చదవండి..Israel-Hamas conflict:ప్రత్యక్ష యుద్ధానికి దిగిన ఇజ్రాయెల్-హమాస్
నిన్నటి వరకు ఒక లెక్క...ఇప్పుడు ఒక లెక్క అంటున్నారు ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్లు. నిన్నటి వరకు క్షిపణులు, వైమానికి దాడులు చేసుకున్న ఇరు వర్గాలు మొదటిసారిగా ప్రత్యక్షంగా తలపడ్డారు. నిన్న గాజాలో ముఖాముఖి పోరు చేసుకున్నామని హమాస్ సైనిక విభాగం అల్-ఖసమ్ బ్రిగేడ్స్ చెప్పింది.

Translate this News:











