తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటి. ఆ నియోజకవర్గం తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. అయితే కొంతకాలంగా అక్కడ టీడీపీకి ఎదురుగాలి వీస్తోంది. ఎందుకంటే సైకిల్ గుర్తుపై గెలిచిన వల్లభనేని వంశీ ప్రస్తుతం వైసీపీ మద్దతుదారుడిగా ఉన్నారు. అయితే ఇప్పుడు వంశీకి గట్టి షాక్ తగిలింది. వైసీపీలోనే ప్రత్యర్థిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు ఫ్యాన్ పార్టీకి గుడ్‌బై చెప్పడం. టీడీపీలో చేరుందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలవడం చకచకా జరిగిపోయాయి. ఇంత జరుగుతున్నా వంశీ మాత్రం మౌనంగానే ఉంటున్నారు. వంశీ ప్రస్తుతం ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు అనేది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తన మాటల దాడితో ప్రత్యర్థులను ఇరుకునపెట్టే వంశీ తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపైన పెదవి విప్పకాపోవడానికి కారణాలేంటి అనేది ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
పూర్తిగా చదవండి..వల్లభనేని వంశీ మౌనం వ్యూహమేనా? బాంబ్ పేల్చేది అప్పుడేనా?
కొంతకాలంగా గన్నవరం రాజకీయాలు గరం గరంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. యార్లగడ్డ వెంకట్రావు వైసీపీకి గుడ్‌బై చెప్పడం.. టీడీపీలో చేరుందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలవడం చకచకా జరిగిపోయాయి. అయితే ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే అయినా వల్లభనేని వంశీ మాత్రం మౌనంగానే ఉంటున్నారు. వంశీ ప్రస్తుతం ఎక్కడున్నారు? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? యార్లగడ్డ వంశీకి షాక్ ఇచ్చారా? లేదా వంశీనే యార్లగడ్డ కు షాక్ ఇవ్వబోతున్నారా? వంశీ బాంబ్ పేల్చేది అపుడేనా? ఆరోజే కౌంటర్ ఎటాక్ ఇవ్వబోతున్నారా? రీడ్ దిస్ స్టోరీ.

Translate this News:











