Drinking milk effects: పాలు(Milk) తాగాలి.. కానీ ఎప్పుడు తాగాలి.. ఎంత తాగాలి అన్నది ముఖ్యం.. ఇక అందరికి అన్ని సెట్ అవ్వాలని లేదు.. కొంతమంది బాడీకి లాక్టోస్ సెట్ అవ్వదు. లాక్టోస్ అనేది మీరు పాలకు జోడించే చక్కెర. ఇది రుచికరంగా ఉంటుంది. ఏదేమైనా, నేషనల్ డైజెస్టివ్ డిసీజెస్ ఇన్ఫర్మేషన్ క్లియరింగ్ హౌస్ ప్రకారం, చాలా మంది లాక్టోస్ ఇన్టాలరెన్స్ కలిగి ఉంటారు. దీని వల్ల వారు పాలకు దూరంగా ఉంటారు. ఇక రాత్రి దీనిని తాగడం వల్ల గ్యాస్, ఉబ్బరం, నొప్పులు, తిమ్మిరి లాంటి సమస్యలు వస్తాయి. జీర్ణ సమస్యలను కూడా పెంచుతుంది.
నైట్ నిద్రపోయే ముందు పాలు ఎందుకు తాగకూడదు? :
Health Tips: ఆ సమయంలో పాలు తాగుతున్నారా? మీరు డేంజర్లో పడినట్టే బాసూ!
ఇలా పాలు తాగి అలా బెడ్ ఎక్కి నిద్రపోయే అలవాటు చాలామందికి ఉంది. అయితే ఇది కరెక్ట్ కాదని నేషనల్ స్లీప్ ఫౌండేషన్ చెబుతోంది. ఇలా నిద్రపోయే ముందు పాలు తాగడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు పెరగడం, అజీర్ణం, బరువు పెరగడం లాంటి సమస్యలు వస్తాయి. అందుకే నిద్రకు కనీసం రెండు గంటల ముందు పాలు తాగాలి కానీ.. తాగిన వెంటనే బెడ్ ఎక్కి నిద్రపోవద్దు.

Translate this News:











