Apple Event 2023 – iPhone 15 launch: ప్రతీ ఏడాది ఓ కొత్త సీరీస్ ను లాంఛ్ చేస్తుంది ఆపిల్ కంపెనీ (Apple) . ఈసారి ఐఫోన్ 15 కొత్త సీరీస్ వస్తోంది. దీంతో పాటూ వాచ్ అల్ట్రా మోడల్స్ ను కూడా విడుదల చేస్తోంది. అమెరికాలో వండర్ లస్ట్ (Apple Wonderlust event) అనే పేరుతో పెద్ద ఈవెంట్ ను నిర్వహిస్తోంది ఆపిల్ కంపెనీ. కాలిఫోర్నియాలో ఆపిల్ పార్క్ లో ఈ ఈవెంట్ ఇవాళ రాత్రి జరగనుంది. భారత కాలమాన ప్రకారం రాత్రి 10.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఆపిల్ యూట్యూబ్ ఛానెల్, ఆపిల్ టీవీ ప్లస్, ఆపిల్.కామ్ వెబ్ సైట్, ఆపిల్ డెవలపర్ యాప్స్‌లో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది. ఈ ఈవెంట్ లో ఆపరేటింగ్ సిస్టమ్ కు సంబంధించిన అప్ డేట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది.
పూర్తిగా చదవండి..Apple Event :ఈరోజే ఆపిల్ వండర్ లస్ట్ ఈవెంట్…ఐఫోన్ 15 సీరీస్ వచ్చేస్తోంది
మొబైల్ ఫోన్లలో రారాజు అయిన ఆపిల్ ఐఫోన్ కొత్త సీరీస్ ఇవాల్టి నుంచి అందుబాటులోకి వచ్చేస్తోంది. వండర్ లస్ట్ పేరుతో అమెరికాలో ఆపిల్ కంపెనీ ఈవెంట్ నిర్వహించనుంది. దీంట్లో ఐఫోన్ 15 సీరీస్ తో పాటూ వాచ్ అల్ట్రా మోడల్స్ ను లాంచ్ చేస్తున్నారు.

Translate this News:















