మిస్సింగ్ మిస్టరీ.. ఆ ముగ్గురు ఎక్కడ?
విశాఖలో ఇంటర్ విద్యార్థుల మిస్సింగ్ మిస్టరీగా మారింది. ఈనెల 24న కాలేజీకని చెప్పి వెళ్లిన ముగ్గురు కనిపించకుండా పోయారు. వీరు శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నారు. ముగ్గురిలో ఇద్దరిది నవాబ్ నగర్ కాగా.. మరొకరిది ప్రియదర్శిని కాలనీ. పోలీసులు వీరికోసం గాలిస్తున్నారు.












