Indian Army MES Recruitment: మీరు 12వ తరగతి పూర్తి చేశారా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ సూపర్ డూపర్ న్యూస్ మీ కోసమే. 12వ తరతతి అర్హతతో ఏకంగా 41,822 ఉద్యోగాలను భర్తీ చేయనుంది ఆర్మీ. మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ (MES) ద్వారా 41,822 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రక్షణ మంత్రిత్వ శాఖ అవకాశం కల్పిస్తోంది. ఈ ఖాళీల కోసం రిక్రూట్మెంట్ ప్రక్రియ త్వరలో అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రారంభమవుతుంది. విద్యార్హతలు, అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, లాంటి మరిన్ని వివరాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. MES అధికారిక వెబ్సైట్లో ఈ ఇన్ఫో ఉంటుంది.ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం, లాస్ట్ డేట్ సబ్మిట్ , ఎంపిక ప్రక్రియ లాంటి ముఖ్యమైన తేదీలు త్వరలోనే అభ్యర్థులకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి.
ప్రస్తుతం రిలీజైన నోటీస్ ప్రకారం.. రిక్రూట్మెంట్ డ్రైవ్ సూపర్వైజర్, డ్రాఫ్ట్స్‌మన్, స్టోర్ కీపర్ సహా స్థానాలను భర్తీ చేయనుంది.
Jobs: నిరుద్యోగులకు బంపర్ న్యూస్.. 12వ తరగతి అర్హతతో 41,822 ఉద్యోగాలు.. చెక్ డీటైల్స్!
మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ (MES) ద్వారా 41,822 పోస్టులు భర్తీ కానున్నాయి. ఆర్కిటెక్ట్ కేడర్, బ్యారక్ అండ్ స్టోర్ ఆఫీసర్, సూపర్వైజర్ , డ్రాఫ్ట్స్‌మ్యాన్, స్టోర్ కీపర్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, Mate(మేట్) పోస్టులను ఫిల్ చేయనున్నారు. వీటిలో కొన్ని పోస్టులకు టెన్త్ పాస్ అయితే చాలు.. మరికొన్ని వాటికి 12వ తరగతి అర్హత ఉండాలి. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది.

Translate this News:











