Indian Air Force Day 2023: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈరోజు తన 91వ వార్షికోత్సవాన్ని (IAF 91st Anniversary) జరుపుకుంటోంది. ప్రయాగ్‌రాజ్‌లో జరిగే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డే పరేడ్‌కు మహిళా అధికారి, గ్రూప్ కెప్టెన్ షాలిజా ధామి (Shaliza Dhami) నాయకత్వం వహించనుంది. ఈ రోజుతొలిసారి మహిళా శక్తి కనువిందు చేయనుంది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఆదివారం 91వ వార్షికోత్సవం సందర్భంగా తొలిసారిగా ప్రయాగ్‌రాజ్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డే పరేడ్‌కు గ్రూప్ కెప్టెన్ శాలిజా ధామి నాయకత్వం వహిస్తారని తెలిపారు. మార్చిలో ఫ్రంట్‌లైన్ IAF కంబాట్ యూనిట్‌కి నాయకత్వం వహించిన మొదటి మహిళ కూడా ధామినే. ఆమె పశ్చిమ సెక్టార్లో క్షిపణి స్క్వాడ్రన్‌కు నాయకత్వం వహిస్తుంది. 2003లో భారత వైమానిక దళంలో చేరిన ధామి క్వాలిఫైడ్ ఫ్లైట్ ట్రైనర్, 2,800 గంటలకు పైగా ప్రయాణించారు.
పూర్తిగా చదవండి..Indian Air Force Day: చరిత్రలో తొలిసారి…పరేడ్‌కు నాయకత్వం వహిస్తున్న తొలిమహిళగా రికార్డ్..!!
భారత వైమానిక దళం తన 91వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈరోజు ప్రయాగ్‌రాజ్‌లో సైన్యం తన సత్తాను ప్రదర్శించనుంది. చరిత్రలో తొలిసారి...పరేడ్‌కు నాయకత్వం వహిస్తున్న తొలిమహిళగా గ్రూప్ కెప్టెన్ శాలిజ థమీ రికార్డు క్రియేట్ చేయనున్నారు.

Translate this News:











