India vs Ireland 1st T20: ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా 0-1తో ముందంజలో ఉంది. డబ్లిన్ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచులో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం యంగ్ ఇండియా సత్తా చాటింది. మొదట బౌలింగ్‌కు వచ్చిన భారత జట్టుకు తొలి ఓవర్లోనే కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా బ్రేక్ ఇచ్చాడు. దాదాపు సంవత్సరం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన బుమ్రా తొలి ఓవర్లోనే రెండు వికెట్లతో సత్తా చాటాడు. 31/5 స్కోరుతో కష్టాల్లో పడిన ఆ జట్టును కాంఫర్, మెక్కార్తి భాగస్వామ్యం ఆదుకుంది. బిష్ణోయ్, ప్రసిద్ధ్‌లకు రెండేసి వికెట్లతో రాణించడంతో ఐర్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు చేసింది. చివర్లో బ్యారీ మెక్కార్తి(51), క్యాంపర్(39) ధాటిగా ఆడటంతో ఐరీష్ జట్టు గౌరవప్రదం స్కోర్ చేయగలిగింది. చివరి ఓవర్లో మెక్కార్తి 22 పరుగులతో రాణించి అభిమానుల్లో జోష్ పెంచాడు.
పూర్తిగా చదవండి..India vs Ireland 1st T20: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో బోణీ కొట్టిన టీమిండియా
ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో యంగ్ ఇండియా శుభారంభం చేసింది. దాదాపు సంవత్సరం తర్వాత కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చిన బుమ్రా తొలి ఓవర్లోనే రెండు వికెట్లతో సత్తా చాటాడు. క్యామ్ బ్యాక్ మ్యాచులోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోవడం విశేషం.

Translate this News:












