Asian Games: ప్రతిష్టాత్మక ఏషియన్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ఈసారి క్రికెట్ పోటీల్లో భారత అమ్మాయిలు బంగారు పతకం కైవసం చేసుకున్నారు. ఫైనల్ మ్యాచులో శ్రీలంక జట్టును చిత్తు చేసి గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. ఈ మ్యాచులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత ఉమెన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45 బంతుల్లో 46 పరుగులు చేయగా.. జెమీమా రోడ్రిగ్స్ 5 ఫోర్లతో 40 బంతుల్లో 42 పరుగులు చేసి రెండో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. షఫాలీ వర్మ 9, రిచా ఘోష్ 9, హర్మన్ ప్రీత్ కౌర్ 2, పూజా వస్త్రాకర్ 2 పరుగులు చేసి నిరాశపరిచారు. అనంతరం 117 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మహిళల జట్టును భారత బౌలర్లు కట్టడి చేయడంతో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 97 పరుగులు మాత్రమే చేసింది. హాసిని పెరీరా 25, నీలాక్షి డి సిల్వా 23, ఓషది రణసింగ్ 19, చమరి అతపత్తు 12 పరుగులు చేశారు.
పూర్తిగా చదవండి..Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. ఫైనల్లో దుమ్మురేపిన మహిళల క్రికెట్ జట్టు
ప్రతిష్టాత్మక ఏషియన్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ఈసారి క్రికెట్ పోటీల్లో భారత అమ్మాయిలు బంగారు పతకం కైవసం చేసుకున్నారు. ఫైనల్ మ్యాచులో శ్రీలంక జట్టును చిత్తు చేసి గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు.

Translate this News:











