India vs West Indies Highlights: ఏవో రెండు మ్యాచ్‌లు పోనిలే అని దేవుడికి ఇచ్చేశాం.. అప్పటికే వన్డేలు, సిరీస్‌లు ఓడిపోయి ఉన్న జట్టుపై ప్రతాపం ఎందుకులే అని లైట్ తీసుకున్నాం.. అలాగని మా యువ జట్టు సత్తాని తక్కువ అంచనా వేస్తారా? విమర్శకులు నోటికి వచ్చినట్టు మాట్లాడుతారా? ఇప్పుడు అర్థమైందా.? సిరీస్ సమం చేసి పడేశాం. ఇవాళ (ఆగస్టు 13) డిసైడర్ మ్యాచ్‌లోనూ ఇదే రిపీట్ అవుతుంది.. సిరీస్ గెలిచేస్తాం.. ఇది ప్రస్తుతం టీమిండియా హార్డ్‌కోర్ ఫ్యాన్స్ మనసులో మాటలు. తొలి రెండు టీ20ల్లో ఓడిపోయినా.. తర్వాత జరిగే ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై అని తెలిసినా.. ఏ మాత్రం వణకని పాండ్యా(pandya) సేన.. నాలుగో టీ20లో విండీస్‌ని చిత్తు చేసింది. సిరీస్‌ని 2-2తో సమం చేసింది. ఇక ఆఖరిదైన ఐదో టీ20 మ్యాచ్ ఇవాళ ఫ్లోరిడా(florida) వేదికగా జరుగనుంది.
పూర్తిగా చదవండి..IND vs WI: ఇదే కద భయ్యా మాకు కావాల్సింది.. విండీస్ తుక్కు రేగొట్టారుగా!
విండీస్‌పై నాలుగో టీ20లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకంగా 9 వికెట్ల తేడాతో కరీబియన్ జట్టును మట్టికరిపించింది. ఓపెనర్లు వీరవిహారం చేసిన ఈ మ్యాచ్‌లో మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే టార్గెట్‌ను రీచ్ అయ్యింది టీమిండియా. శుభ్‌మాన్ గిల్(77), యశస్వి జైస్వాల్(84 నాటౌట్) చెలరేగి బ్యాటింగ్ చేశారు. ఈ మ్యాచ్ విక్టరీతో సిరీస్ 2-2తో సమం అయ్యింది. ఇక చివరిదైన ఐదో టీ20 ఇవాళ (ఆగస్టు 13) ఫ్లోరిడా వేదికగా భారత్ కాలమానం ప్రకారం 8గంటలకు ప్రారంభమవుతుంది.

Translate this News:











