India vs Pakistan World Cup 2023: పిచ్ రెడీ అయిపోయింది. ఆటగాళ్ళు తయారుగా ఉన్నారు. ఇంక మ్యాచ్ మొదలవ్వడమే ఆలస్యం అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్న తరుణం రానే వచ్చింది. భారత్-పాక్ మ్యాచ్ కు జరిగే రోజు వచ్చేసింది. మరికొన్ని గంటల్లో ఆట మొదలవుతుంది. ప్రపంచకప్ లో భారత్-పాక్ ఇప్పటికి ఏడు సార్లు తలపడ్డాయి. ఇది 8వ సారి. ఇప్పటివరకు పాకిస్తాన్ (Pakistan) జట్టును ఒక్క మ్యాచ్ గెలవనివ్వలేదు టీమ్ ఇండియా (Team India). ఈసారి కూడా ఈ రికార్డ్ ను రోహిత్ సేన నిలబెడుతుందా లేదా అనే చూడాలి. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో భారత్-పాక్ మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుంది.
పూర్తిగా చదవండి..WORLD CUP 2023: ఈసారి కూడా విజయం మనదేనా? 8-0తో రోహిత్ రికార్డ్ సృష్టిస్తాడా?
అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న క్రికెట్ సమరం ఈరోజే. ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మామూలుగానే భారత్-పాక్ మ్యాచ్ అంటే ఒకరకమైన ఫీవర్ ఉంటుంది. అలాంటిది ఇండియాలో జరుగుతోంది అంటే అది మరి కొంచెం ఎక్కువ అవుతుంది. ప్రస్తుతం భారత్లో ఇదే పరిస్థితి. మరికొన్ని గంటల్లో భారత్-పాక్ మ్యాచ్ మొదలవబోతోంది. పాక్ మీద ఓటమి ఎరుగని జట్టుగా రోహిత్ సేన టీమ్ ఇండియాను నిలబెడుతుందా లేదో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

Translate this News:











