భారత్, కెనడా మధ్య రాజుకున్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు మళ్లీ హీటెక్కాయి. భారత్లో తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకుంటున్నట్లు అధికారిక ప్రకటన చేసిన కెనడా.. న్యూఢిల్లీ అల్టిమేటం అంతర్జాతీయ చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ కవ్వింపు చర్యలకు పాల్పడింది. అయితే.. ఈ ఆరోపణలపై తాజాగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తమ స్పందనను తెలియజేసింది. కెనడాకు దీటుగా గట్టిగా కౌంటర్ ఇచ్చింది.చట్టాలకు అనుగుణంగానే తాము.. ఒట్టవాకు దౌత్యవేత్తలను తగ్గించుకోవాలని సూచనలు చేసినట్లు పేర్కొంది. ఇక భారత్లో 41 మంది దౌత్యవేత్తలను వెనక్కి రప్పించామని కూడా కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో మరోసారి ఇండియాపై ఆరోపణలు చేశారు. భారత్లోని దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించకపోతే.. అదనంగా ఉన్న వారికి దౌత్యపరంగా ఉన్నటువంటి రక్షణ తొలగిస్తామని ఢిల్లీ చెప్పింది.ఇది అసమంజసం, అనూహ్య నిర్ణయమని.. అలాగే దౌత్య సంబంధాల కోసం ఏర్పరుచుకున్న వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని మోలానీ ఆరోపణలు చేశారు.
పూర్తిగా చదవండి..India-Canda: మళ్లీ హీటెక్కిన భారత్, కెనడా వివాదం.. గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్
భారత్లో తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకున్నామని అధికారిక ప్రకటన చేసిన కెనడా.. ఇండియాపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో భారత్.. కెనడాకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇండియాలోని దౌత్య సిబ్బంది సంఖ్యపై కెనడా ప్రభుత్వం చేసిన వ్యాఖ్యాలను చూశామని.. ఇక్కడ కెనడాకు చెందిన దౌత్యవేత్తల సంఖ్య ఎక్కువగా ఉందని పేర్కొంది. అంతేగాక మన అంతర్గత విషయాల్లో వాళ్లు తరచుగా జోక్యం చేసుకుంటున్నారని.. న్యూఢిల్లీ, ఒట్టావా దౌత్యసంబంధాల్లో పరస్పర సమానత్వం ఉండాలనేదే తాము కోరుకుంటున్నామని తెలిపింది.

Translate this News:











