వచ్చే ఏడాదితో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టి 10ఏళ్లు పూర్తవుతుంది. ఓవైపు కాంగ్రెస్(Congress) 2004, 2009 ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయాలని భావిస్తోంది. భారత రాజకీయాలు 2014 ముందు నాటికి తిరిగి రావాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. ఇటు మోదీ(Modi) హ్యాట్రిక్ కొట్టలాని గట్టిగా డిసైడ్ అయ్యారు. 2024 జనరల్ ఎలక్షన్స్ భారత్ రాజకీయాల భవిష్యత్‌ను నిర్ణయిస్తానడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదే సమయంలో యావత్ దేశం చూపు రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై పడింది. ముఖ్యంగా దేశ రాజకీయాల్లో కేసీఆర్(KCR) పాత్ర ఎలా ఉండనున్నదానిపై ఈ ఎలక్షన్స్ తర్వాత ఓ క్లారిటీ రానుంది.
పూర్తిగా చదవండి..KCR: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుతారా? ఎన్నికల తర్వాత ఏం జరగబోతోంది?
తెలంగాణ ఎన్నికలు కేసీఆర్‌ను జాతీయ నాయకుడిని చేస్తాయా.. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ నేషనల్ వైడ్ హీరోగా మారనున్నారా? ఇప్పుడివే ప్రశ్నలు అందరి నోటా వినిపిస్తున్నాయి. ఆర్థికవేత్త, కాలమిస్ట్, మానవ హక్కుల యాక్టివిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ పెంటపటి పుల్లారావు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కేసీఆర్ గెలిస్తే కాంగ్రెస్‌కు రాజకీయంగా తిప్పలు తప్పవని విశ్లేషించారు. రెండు జాతీయ పార్టీలకు సంబంధం లేకుండా ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కేసీఆర్ మళ్లీ ప్రయత్నిస్తారన్నారు.

Translate this News:











