Pawan Kalyan About G20 Summit: భారత్‌లో జీ20 సదస్సు ముగిసింది. ప్రతిష్టాత్మక జీ20 దేశాల సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా.. భారతదేశం పురోగమిస్తోందని, దానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. జీ20 సమ్మిట్ (G20 Summit)లో భారత్ అగ్ర రాజ్యాలతో బలమైన బంధాన్ని ఏర్పడుచుకుందన్న ఆయన.. అందుకు నిరంతరం కృషి చేసిన ప్రధాని మోడీకి (PM Modi) ధన్యవాదాలు తెలిపారు. జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో (Joe Biden) పాటు పలు దేశాలకు చెందిన ప్రధానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాని మోడీ జీ20 సమావేశంలో భాగంగా వివిధ దేశాధినేతలతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. భారత్ మొదటి సారి జీ20 దేశాలకు అధ్యక్షత వహిస్తున్నందుకు పవన్ కళ్యాణ్ అనందం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: భారత్‌లో జీ20 సదస్సు నిర్వహించడం గర్వకారణం
భారత్‌లో జీ20 సదస్సు ముగిసింది. ప్రతిష్టాత్మక జీ20 దేశాల సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు.

Translate this News:











