ఆసియా క్రీడలు 2023లో ఇండియా బోనీ కొట్టింది. టీమ్ ఈవెంట్ లో తన మొదటి స్వర్ణాన్ని నమోదు చేసుకుంది.పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో పతకం వచ్చింది. రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, దివ్యాంశ్ సింగ్ సన్వార్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ లతో కూడిన భారత జట్టు తొలి బంగారు పతకాన్ని ఇండియాకు అందించింది. క్వాలిఫికేషన్ ఫైనల్ రౌండ్ లో 1893.7 స్కోర్ తో టీమ్ ఇండియా టాప్ లో నిలిచింది. దీంతో భారత్ ప్రపంచ రికార్డ్‌ను నెలకొల్పొంది. అంతకు ముందు చైనా చేసిన 1893.3 పాయింట్ల రాకర్డ్ ను ఇండియా ఇప్పుడు బద్దలు కొట్టింది. ఇండోనేషియా సిల్వర్ మెడల్, చైనా కాంస్య పతకాలను దక్కించుకున్నాయి.
పూర్తిగా చదవండి..Asia games:ఆసియా క్రీడల్లో భారత్ కు తొలి స్వర్ణం
చైనాలో జరుగుతున్న ఏషియా గేమ్స్ 2023లో భారత్ కు మొదటి స్వర్ణం లభించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ఇండియా స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.

Translate this News:











