Ind vs Pak World Cup 2023: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పూనకాలు వస్తాయి. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఈ రెండు జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ను రెండు దేశాల మధ్య జరిగే యుద్ధం అన్నట్టు ఫీలయిపోతారు. అక్టోబర్ 14న ఇండియా-పాకిస్థాన్ (India – Pakistan) జట్ల మధ్య జరిగే మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు అన్నీ రెడీ చేసుకుంటున్నారు. మ్యాచ్ జరిగే రోజు ఫ్లైట్ టికెట్ ధరలు ఆకాశాన్ని తాకగా.. హోటళ్ల గదుల ధరలు అయతే ఏకంగా పది రెట్లు పెరిగిపోయాయి. అయినా ఫ్యాన్స్ తగ్గేదేలా అంటూ బుకింగ్స్ చేసుకుంటున్నారు. దాదాపు అహ్మదాబాద్లో (Ahmedabad) ఉన్న హోటల్స్ అన్నీ బుక్ అయిపోయాయి. ఇంకా చాలా మందికి రూమ్స్ కావాల్సి ఉంది.
పూర్తిగా చదవండి..Ind vs Pak World Cup 2023:భారత్-పాక్ మ్యాచ్ క్రేజ్…ఆసుపత్రులలో బెడ్స్ బుకింగ్
మరో రెండు రోజుల్లో వరల్డ్ కప్లో భారత్-పాక్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు క్రేజీగా ఎదురు చూస్తున్నారు. ప్రత్యక్షంగా చూడాలనుకున్నవాళ్ళు అందరూ వేలూ, లక్షలూ పెట్టి టికెట్లు ఇప్పటికే కొనేసుకున్నారు కూడా. అయితే ఇప్పుడు దీనికి మించిన వార్త మరొకటి తెగ వైరల్ అవుతోంది. అది వింటే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే.

Translate this News:











