Eluru District: ఏలూరు జిల్లాలో బంగారం పేరిట ఒక ముఠా ఘరానా చోరికి పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాయమాటలతో నమ్మించి దుండగులు రూ.15 లక్షలు దోచుకెళ్లారు. కుక్కునూరు మండలం తొండిపాక గ్రామానికి చెందిన కొత్తూరి చెన్నకేశవకు తాడేపల్లిగూడెం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. దీంతో చెన్నకేశవ తాను బంగారం కొనదలుచుకున్న విషయం సదరు వ్యక్తికి తెలిపాడు. బంగారం కొనుగోలు జాగ్రత్తగా చేయాలని, దుకాణాలకు వెళితే మోసం చేస్తారని.. ఆ వ్యక్తి నమ్మబలికాడు. మనం ఆర్డర్ చేస్తే మేలిమి బంగారం తెచ్చి ఇచ్చే వ్యాపారులు ఉంటారని, వారి నుంచి కొనుగోలు చేస్తే మోసాలకు తావుండదని తెలిపాడు.ఈ క్రమంలో దుబాయ్ నుంచి అక్రమ మార్గంలో తీసుకొచ్చిన బంగారం బిస్కెట్లు తమ వద్ద ఉన్నాయని ఆ దంపతులను నమ్మించారు. అరకిలో బంగారు బిస్కెట్లు 20 లక్షల రూపాయలకు ఇస్తామని ఆ వ్యక్తి నమ్మించారు.
పూర్తిగా చదవండి..బంగారం పేరిట ఘరానా మోసం..రూ.15 లక్షలు స్వాహా..!!
దంపతులను మాయమాటలతో నమ్మించి రూ.15 లక్షలు దోచుకెళ్లారు దుండగులు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. బంగారం పేరిట ఘరానా మోసం చేశారు.

Translate this News:











